News January 28, 2025

నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా

image

TG: రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా నిర్వహించనుంది. క్లాక్ టవర్ వేదికగా KTR నాయకత్వంలో ఆ పార్టీ నేతలతో పాటు పలువురు రైతులు నిరసన తెలపనున్నారు. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు మాత్రమే ధర్నాను నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 21, 2025

H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.

News October 21, 2025

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

image

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.

News October 21, 2025

కళ్యాణ యోగం కల్పించే ‘కాళీ రూపం’

image

కంచి కామాక్షి ఆలయం వెనుక కాళీ కొట్టమ్‌లో ఆది కామాక్షి దేవి కొలువై ఉంటారు. పార్వతీ దేవియే ఇక్కడ కాళీమాత రూపంలో వెలిశారని చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి రూపం శివలింగంపై కొలువై ఉంటుంది. అర్ధనారీశ్వర లింగంగా పూజలందుకుంటుంది. ఆదిశంకరాచార్యులు ఈ గుడిలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపజేశారని చెబుతారు. పెళ్లికాని వారు కామాక్షి దేవిని దర్శిస్తే కళ్యాణ యోగం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.