News January 28, 2025
నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా

TG: రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా నిర్వహించనుంది. క్లాక్ టవర్ వేదికగా KTR నాయకత్వంలో ఆ పార్టీ నేతలతో పాటు పలువురు రైతులు నిరసన తెలపనున్నారు. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు మాత్రమే ధర్నాను నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 14, 2025
తులసిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు తులసిబాబు తన గుండెలపై కూర్చొని దాడి చేశాడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 14, 2025
ప్రేమికుల దినోత్సవం నాడు దారుణం

AP: ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేశ్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
News February 14, 2025
వాలంటైన్స్ డే: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి అప్డేట్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను ఈనెల 24న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది.