News December 16, 2024
బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్
TG: బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదని హరీశ్ రావు అన్నారు. ఏ సబ్జెక్ట్ పై మాట్లాడాలో చెప్పలేదని తెలిపారు. సభను కనీసం 15 రోజులు జరపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
Similar News
News January 25, 2025
ICC మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అర్ష్‌దీప్
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ICC ప్రకటించింది. 25 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ బౌలర్ టీ20ల్లో భారత తరఫున అత్యధిక వికెట్లు(97) తీసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. 2024లో ఆడిన 18 మ్యాచుల్లో 36 వికెట్లు తీశారు. గత ఏడాది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించారు.
News January 25, 2025
సోనూసూద్ ఫౌండేషన్‌కు FCRA లైసెన్స్ మంజూరు
సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్సు పొందిన NGOలు ఐదేళ్ల పాటు విదేశీ నిధులను స్వీకరించవచ్చు, వాడుకోవచ్చు. సామాజిక సేవ చేయడం, అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వనరులు, సాయం అందాలనేదే తమ లక్ష్యమని సూద్ ఫౌండేషన్ పేర్కొంది. కొవిడ్ టైంలో సోనూసూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
News January 25, 2025
టీమ్ ఇండియాకు మరో షాక్? స్టార్ ఆల్‌రౌండర్‌కి గాయం?
ఓపెనర్ అభిషేక్ శర్మ కాలి గాయంతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తుండగా తాజాగా మరో షాక్ తగిలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్‌కు దూరమయ్యారు. రింకూ సింగ్ కూడా గాయపడటంతో నేటి, తర్వాతి మ్యాచులు ఆడటం లేదు. వారికి బ్యాకప్‌గా శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌ను టీమ్ ఇండియా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.