News April 4, 2024
పార్టీ మార్పుపై స్పందించిన BRS MLA

TG: పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి, BRS MLA గంగుల కమలాకర్ స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారాన్ని గంగుల కొట్టిపారేశారు. ప్రజల తీర్పు BRSకు అనుకూలంగా ఉంటుందని, కరీంనగర్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News February 12, 2026
రూ.55,649 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

రోజుకో రీతిలో సాగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు ₹వేలకోట్లు నష్టపోతున్నారు. గత 5 ఏళ్లలో 65,89,063 మంది బాధితులు ₹55,649 CR పోగొట్టుకున్నారు. ఈ మోసాలు ఏటేటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 2021లో 2,62,846 ఫిర్యాదులు రాగా ₹551 CR మోసపోయారు. అదే 2025లో 24,02,579లు కేసులు నమోదైతే మోసపోయిన సొమ్ము ₹22,495 CRకు చేరింది. కాగా 23.61 లక్షల కేసుల్లో ₹8189 కోట్లు కాపాడగలిగామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.
News February 12, 2026
అరవ శ్రీధర్ రావట్లేదా?.. అసెంబ్లీ లాబీలో చర్చ

AP: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు <<19038842>>ఎదుర్కొంటున్న<<>> రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ గురించే ఇవాళ అసెంబ్లీ లాబీలో ఎక్కువసేపు చర్చ సాగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ అసెంబ్లీకి రావట్లేదా? అంటూ మిగతా ఎమ్మెల్యేలు చర్చించుకున్నారట. అయితే ఈ సెషన్ మొత్తానికి ఆయన్ను రావద్దని జనసేన అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. అటు బయట పార్టీ కార్యక్రమాల్లోనూ శ్రీధర్ కనిపించడం లేదు.
News February 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్లో పరిమితి లేని వైద్య సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పేలో 1.5%, సర్కార్ 1.5% కలిపి మొత్తం 3%(ఏటా సుమారు రూ.1000Cr) కేటాయించనుంది. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఇందులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీనికోసం కమిటీని ఏర్పాటు చేయనుంది.


