News April 4, 2024

పార్టీ మార్పుపై స్పందించిన BRS MLA

image

TG: పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి, BRS MLA గంగుల కమలాకర్ స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారాన్ని గంగుల కొట్టిపారేశారు. ప్రజల తీర్పు BRSకు అనుకూలంగా ఉంటుందని, కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News April 18, 2026

అందుకే మ్యాచ్‌లకు రావట్లేదన్న డింపుల్ బ్యూటీ

image

PBKS యజమాని ప్రీతి జింటా గత సీజన్ వరకూ స్టేడియానికి వచ్చి తన జట్టుకు సపోర్ట్ చేసేవారు. అయితే ఈ సీజన్‌లో జట్టు విజయాలతో దూసుకెళ్తున్నా ఆమె స్టేడియంలో కనిపించకపోవడంతో SM వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నించారు. దీంతో ఆమె రిప్లై ఇచ్చారు. ‘చాలా కాలంగా పిల్లలకు దూరంగా ఉన్నా. ప్రస్తుతం వాళ్లకు సెలవులు. వారితో గడపడానికే మ్యాచ్‌లకు రావట్లేదు. త్వరలోనే స్టేడియంలో కనిపిస్తా’ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News April 18, 2026

OTTలోకి కొత్త సినిమాలు

image

⋆ ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి నటించిన ‘బ్యాండ్ మేళం’ ఈ నెల 24 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
⋆ ప్రియదర్శి, సాయికుమార్ ‘సుయోధన’ తాజాగా JioHotstar, ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
⋆ రాశీఖన్నా ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ మే 8 నుంచి ప్రైమ్ వీడియోలోకి రానుంది.
⋆ పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళ హిట్ మూవీ ‘యూత్’ Netflixలో, రాధిక నటించిన ‘తాయి కిళవి’ JioHotstarలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

News April 18, 2026

యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

image

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.