News July 13, 2024
సీఎం రేవంత్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే!
TG: కాంగ్రెస్‌లో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరనున్నట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాసేపట్లో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇవాళ ఉదయమే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరారు.
Similar News
News October 16, 2024
ఒక్క సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్న స్టార్ హీరో!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.
News October 16, 2024
BREAKING: సజ్జలకు పోలీసుల నోటీసులు
AP: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
News October 16, 2024
J&K మంత్రివర్గంలో చేరట్లేదు: కాంగ్రెస్
జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.