News October 23, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS MLAలపై వేటు వేయాలి: జీవన్ రెడ్డి

image

TG: తన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మరోసారి <<14421491>>అధిష్ఠానంపై<<>> హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన BRS MLAలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని, ఎవరైనా ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలనే చట్టం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఎంఐఎంను మినహాయించినా సుస్థిరంగా ఉంటుందన్నారు.

Similar News

News November 15, 2025

39,506 మారుతీ గ్రాండ్ విటారా కార్లు వెనక్కి

image

సాంకేతిక సమస్యలు తలెత్తిన గ్రాండ్ విటారా మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2024 DEC 9 నుంచి 2025 APR 29 వరకు తయారైన 39,506 కార్లలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సిస్టమ్‌లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్స్‌లో ఆ కార్లను పరీక్షించి లోపాలున్న పరికరాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది.

News November 15, 2025

DRDOలో 18 అప్రెంటిస్‌లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>DRDO<<>> అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ సెంటర్, హల్ద్వానీలో 18 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. 18ఏళ్లు నిండిన ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News November 15, 2025

రెండు చోట్ల ఓడిన బిహార్ ‘సింగం’

image

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిహార్ ‘సింగం’గా పిలవబడే మాజీ ఐపీఎస్ శివ్‌దీప్ లాండే ఓటమిపాలయ్యారు. అరారియా, జమాల్‌పూర్‌ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమాల్‌పూర్‌లో జేడీయూ నేత నచికేత మండల్ 96,683 ఓట్లతో, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహ్మాన్ 91,529 ఓట్లతో విజయం సాధించారు. లాండేకు ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.