News October 23, 2024
కాంగ్రెస్‌లో చేరిన BRS MLAలపై వేటు వేయాలి: జీవన్ రెడ్డి
TG: తన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మరోసారి <<14421491>>అధిష్ఠానంపై<<>> హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన BRS MLAలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని, ఎవరైనా ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలనే చట్టం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఎంఐఎంను మినహాయించినా సుస్థిరంగా ఉంటుందన్నారు.
Similar News
News November 15, 2024
ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు: CM రేవంత్
TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి సేవలు వినియోగించాలని సూచించారు. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని చెప్పారు. డ్రంక్&డ్రైవ్ కోసం వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశించారు.
News November 15, 2024
తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా UP యోధాస్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓడింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 20-16తో ఆధిక్యం కనబర్చింది. అయితే ఆ తర్వాత UP ఆటగాళ్లు పుంజుకున్నారు. చివరికి UP 40 పాయింట్లు సాధించగా టైటాన్స్ 34 పాయింట్లకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్(32)పై U ముంబా(35) గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో హరియాణా ఉండగా టైటాన్స్ 6వ స్థానంలో ఉంది.
News November 15, 2024
ఈ నెల 19న ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
TG: ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలకు సీఎం రేవంత్ వరంగల్ వేదికగా ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నారు.