News December 30, 2024
బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిన పాము: రఘునందన్
BRS పార్టీ ఓ చచ్చిన పాము అని BJP MP రఘునందన్ తాజాగా వ్యాఖ్యానించారు. KTRపై BJP, కాంగ్రెస్ కలిసి కేసులు పెడుతున్నాయన్న MLC కవిత వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ‘KTR కేసుతో BJPకి సంబంధమేముంది? కవిత తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. బీసీ కులగణనపై ఆమె ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? బీసీలపై బీఆర్ఎస్‌ది మొసలి కన్నీరు. వారికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే BRS అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలి’ అని సవాల్ చేశారు.
Similar News
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.
News January 16, 2025
ఆరు వారాలే ఒప్పందం!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.