News August 27, 2024

BRS తెలంగాణను BJPకి తాకట్టుపెట్టింది: పొన్నం

image

TG: MLC కవిత బెయిల్ కోసం BRS పార్టీ తెలంగాణను BJPకి తాకట్టు పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. BJP పెట్టిన ప్రతి బిల్లుకూ BRS సహకరించిందని ఆయన అన్నారు. BRS, BJP కుమ్మక్కు కావడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. ఆమెకు బెయిల్ వస్తుందనేది అందరూ ఊహించిందేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు రెండు పార్టీలు కలిశాయని మంత్రి విమర్శించారు.

Similar News

News February 14, 2026

విశాఖ: బిల్డింగ్ పైనుంచి పడి యువకుడి మృతి

image

విశాఖలోని సాగర్ నగర్‌లో బిల్డింగ్ పరంజి విరిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన కోలా రాజు(30) డ్రైవింగ్, విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ బిల్డింగ్‌లో విద్యుత్ పని చేస్తుండగా పరంజి విరిగిపోవటంతో 4 అంతస్థుల పైనుంచి పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News February 14, 2026

ఆ బౌలర్‌తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

image

రేపు పాక్‌తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని టీమ్‌ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్‌ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.

News February 14, 2026

ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

image

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.