News March 30, 2024

కడియంపై చర్యలకు సిద్ధమవుతున్న BRS

image

TG: పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై BRS అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే పలువురు నేతలు స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

Similar News

News January 13, 2026

యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా!

image

సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సింది. కానీ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. కాగా ప్రిలిమ్స్ పరీక్ష మే 24న, మెయిన్స్ ఆగస్టు 21న నిర్వహిస్తామని గతంలో యూపీఎస్సీ ప్రకటించింది.

News January 13, 2026

రేపే మకరజ్యోతి దర్శనం

image

శబరిమలలో రేపు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.

News January 13, 2026

మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్‌ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్‌ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.