News March 30, 2024

కడియంపై చర్యలకు సిద్ధమవుతున్న BRS

image

TG: పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై BRS అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే పలువురు నేతలు స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

Similar News

News February 10, 2026

వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

image

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.

News February 10, 2026

ఏపీలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు: కేంద్రం

image

AP: రాష్ట్రంలోని బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ హరీశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ డబ్బును అసలైన యజమానులకు లేదా వారి వారసులకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. <<18520571>>‘మీ సొమ్ము- మీ హక్కు’<<>> కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 34వేల ఖాతాలకు చెందిన రూ.161 కోట్లను సెటిల్ చేశామని చెప్పారు.

News February 10, 2026

పాన్ కార్డు రూల్స్‌లో మార్పులు!

image

పాన్ కార్డు రూల్స్‌లో పలు మార్పులను కేంద్రం ప్రతిపాదించింది. ఒక FYలో ₹10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్లు/విత్ డ్రాలు చేస్తే పాన్ తప్పనిసరి. ప్రస్తుతం బ్యాంకుల్లో ఒక రోజులో లావాదేవీలు ₹50 వేలు దాటినా అడుగుతున్నారు. కొత్త వాహనం విలువ ₹5 లక్షలు, హోటల్ ఖర్చు ₹లక్ష దాటినా సమర్పించాలి. స్థిరాస్తి అమ్మకం/కొనుగోలు విలువ ₹20 లక్షలు దాటినా పాన్ నంబర్ ఇవ్వాలి. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలయ్యే అవకాశం ఉంది.