News March 29, 2024

కేకే, కడియం నిర్ణయాలపై మండిపడుతున్న BRS శ్రేణులు

image

MLA కడియం శ్రీహరి, MP కే కేశవరావులు BRSని వీడటంపై ఆపార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సోదరులుగా భావించి వీరికి పార్టీలో, ప్రభుత్వంలో KCR సముచిత స్థానాన్ని ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. కేకేను రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా, శ్రీహరిని డిప్యూటీ CMని చేశారని, KCR కష్టాల్లో ఉంటే ఆయనను వీడటం సరికాదంటున్నారు. ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ.. వారి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 23, 2025

ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.

News January 23, 2025

కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి తదితరులను కలుస్తారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.

News January 23, 2025

రికార్డు సృష్టించిన చైనా కృత్రిమ సూర్యుడు

image

చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1,000 సెకన్ల(16 నిమిషాలు)పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. ఇందులో భారత్‌తోపాటు అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.