News April 14, 2025
అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన: KCR

TG: డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సీఎం KCR నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా BRS పాలన సాగిందని, దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
మహిళా బిల్లుకు గతంలోనే మద్దతిచ్చాం: CBN

AP: ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు పలుకుతున్నామని CM చంద్రబాబు TDP ఆఫీసులో మీడియాతో పేర్కొన్నారు. ‘గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాం. కొన్ని కారణాలతో అప్పుడది కార్యరూపం దాల్చలేదు’ అని వివరించారు. ఈసారైనా బిల్లు నెగ్గి అమలవుతుందా? అని మీడియా ప్రశ్నించగా ‘మహిళా బిల్లు ఆమోదం పొందితే మీరు వంటింట్లో పని చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా’ అని CBN వ్యాఖ్యానించారు.
News April 17, 2026
ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.
News April 17, 2026
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.


