News October 3, 2024

మూసీ నిర్వాసితులకు BRS రూ.500కోట్లు ఇవ్వాలి: CM

image

TG: BRS పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్‌లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.

Similar News

News February 2, 2026

JGTL: ఠాణా మెట్లు ఎక్కరు.. రచ్చబండపైనే పరిష్కారం!

image

నేటి యాంత్రిక జీవనంలో చిన్నచిన్న విషయాలకే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే రోజుల్లో.. ధర్మపురి మండలం అక్సాయిపల్లె గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం 112 ఇళ్లు, 286 ఓట్లు ఉన్న ఈ గ్రామంలో ఇప్పటివరకు ఏ ఒక్కరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకపోవడం విశేషం. గ్రామంలో ఏ సమస్య తలెత్తినా రచ్చబండ వద్ద పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటున్నారు. అప్యాయతలను కాపాడుకుంటూ ప్రస్తుత సమాజానికి ఈ గ్రామం దిక్సూచిగా నిలుస్తోంది.

News February 2, 2026

TODAY HEADLINES

image

* నిర్మలమ్మ పద్దు.. ₹53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు
* ఇది చరిత్రాత్మక బడ్జెట్: PM
* ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్
* దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: భట్టి
* కేసీఆర్‌ను 4.50 గంటలు విచారించిన సిట్
* T20WC: INDతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాక్
* కవలలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు

News February 2, 2026

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.