News April 11, 2025

సభ అనుమతులపై హైకోర్టుకు BRS

image

TG: ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై BRS హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ స్థాపించి 25సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సభ జరుపుతున్నామని కోర్టుకు తెలిపింది. సభకు అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరింది. హైకోర్టు విచారణను 17కు వాయిదా వేసింది. ఈ నెల 27న BRS సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎల్కతుర్తిలో నిర్వహించేలా పార్టీ నిర్ణయించగా, పోలీసులు అనుమతివ్వలేదు.

Similar News

News December 8, 2025

ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితం: కలెక్టర్

image

ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని, గోనె సంచులు తెచ్చుకున్న వారికి అధికారులే నగదు చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించడానికి రైతులే స్వయంగా గోనె సంచులు తెచ్చుకుంటే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

News December 8, 2025

మూసిన గదిలో రాసిన పత్రం కాదిది: భట్టి

image

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసిన గదిలో రాసిన పత్రం కాదని, ఇది ప్రజల పత్రమని గ్లోబల్ సమ్మిట్‌లో Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమన్నారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంశాలతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళా శక్తి, రైతుభరోసా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్-1గా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 8, 2025

అంగారకుడిపైనా గంగా తరహా నదీ వ్యవస్థ

image

జీవనానికి అనుకూలమైన గ్రహం కోసం చేస్తోన్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. INDలో గంగా నదీ వ్యవస్థ మాదిరిగానే అంగారకుడిపైనా వాటర్ నెట్‌వర్క్ ఉండేదని టెక్సాస్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. అక్కడ 16 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలను వారు మ్యాపింగ్ చేశారు. ‘బిలియన్ ఏళ్ల కిందట మార్స్‌పై వర్షాలు కురిసేవి. జీవం కూడా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి’ అని చెప్పారు.