News April 11, 2025
సభ అనుమతులపై హైకోర్టుకు BRS

TG: ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై BRS హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ స్థాపించి 25సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సభ జరుపుతున్నామని కోర్టుకు తెలిపింది. సభకు అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరింది. హైకోర్టు విచారణను 17కు వాయిదా వేసింది. ఈ నెల 27న BRS సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎల్కతుర్తిలో నిర్వహించేలా పార్టీ నిర్ణయించగా, పోలీసులు అనుమతివ్వలేదు.
Similar News
News April 19, 2026
CSK చెత్త రికార్డ్

IPL: SRHతో నిన్న ఓడిన చెన్నై జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2019 నుంచి 180+ స్కోరును ఒక్కసారి కూడా ఛేదించలేకపోయింది. అప్పటి నుంచి CSK జట్టుకు 14 సార్లు 180+ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం రాగా అన్నింటిలోనూ ఓడింది. మరోవైపు HYDలోని ఉప్పల్ స్టేడియంలో CSK 8 ఏళ్లుగా ఒక్క గెలుపునూ నమోదు చేయలేకపోయింది. ఇక ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలోనే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానంలో ఉంది.
News April 19, 2026
AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
News April 19, 2026
పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

AP Dy.CM పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.


