News February 21, 2025

దారుణం.. ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

image

దేశంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో చిన్న పిల్లల్ని సైతం చిదిమేస్తున్నారు కొంతమంది మృగాళ్లు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

Similar News

News January 23, 2026

Paytm షేర్ విలువ 10% డౌన్.. కారణమిదే

image

Paytm మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్’ షేర్లు ఒక్కరోజే 10% పడిపోయి ₹1,134కు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్’ (PIDF) పథకం 2025 డిసెంబర్ తర్వాత కొనసాగుతుందో లేదో అన్న ఆందోళనే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Paytm లాభాల్లో ఈ పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలే 20% వరకు ఉంటాయని అంచనా. దీనిపై RBI నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

News January 23, 2026

ప్రభుత్వ బడుల్లో కేంబ్రిడ్జి పాఠాలు!

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేలా కేంబ్రిడ్జి వర్సిటీ(UK)తో GOVT ఒప్పందం చేసుకోనుంది. దీనిద్వారా జాయింట్ రీసెర్చ్, కరిక్యులమ్ రూపొందిస్తారు. 8-10 తరగతుల్లో కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రవేశపెడతారు. AU, IIT తిరుపతి సహా ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్సిటీ భాగస్వామ్య కోర్సులు నిర్వహిస్తారు. ఈమేరకు దావోస్‌లో మంత్రి లోకేశ్ వర్సిటీ VCతో చర్చించారు.

News January 23, 2026

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA, MCom, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును careers@bobcaps.inకు ఈ మెయిల్ చేయాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/