News February 21, 2025
దారుణం.. ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

దేశంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో చిన్న పిల్లల్ని సైతం చిదిమేస్తున్నారు కొంతమంది మృగాళ్లు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
Similar News
News March 25, 2025
వేసవిలో చెమట వాసన వేధిస్తోందా?

వేసవిలో శరీరం నీటిని ఎక్కువగా కోల్పోయి చెమట విపరీతంగా వస్తుంది. దీంతో చెడు వాసన వచ్చి అసౌకర్యానికి గురిచేస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో నిమ్మకాయ రసం, పెరుగు తప్పనిసరి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడేందుకు సాయపడతాయంటున్నారు. రోజ్ వాటర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీటితో స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుందని సూచిస్తున్నారు.
News March 25, 2025
ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్!

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. ఏప్రిల్ ఆరంభంలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని సమాచారం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్‌తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, DoPT నుంచి సూచనలు వచ్చాయి. కమిషన్ ఏర్పాటయ్యాక వీటిని సమీక్షిస్తుంది. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం దక్కుతుంది.
News March 25, 2025
టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.