News November 16, 2024
BSNL: 2 నెలల్లో 65 లక్షల మంది కొత్త యూజర్లు
ప్రభుత్వ రంగ టెలికం ప్రొవైడర్ BSNL ఊపందుకుంటోంది. DOT ప్రకారం గత 2 నెలల్లోనే 65 లక్షల మంది కొత్త యూజర్లను పొందింది. ప్రైవేట్ ప్రొవైడర్లు విపరీతంగా రీఛార్జ్ ధరలు పెంచడంతో AIRTEL, JIO యూజర్లు BSNLలో చేరుతున్నట్లు DOT తెలిపింది. ఇదే సమయంలో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు 40 లక్షల యూజర్లను కోల్పోయాయి. కాగా, మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి సింధియా తెలిపారు.
Similar News
News December 11, 2024
చలికాలంలో రోగనిరోధక శక్తికి ఇవి తినండి!
చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇవి దూరమవుతాయి. విటమిన్ C ఉండే ఆరెంజ్, లెమన్, నిమ్మను ఆహారంలో భాగం చేయాలి. అల్లం, వెల్లుల్లి తరచూ తీసుకోవాలి. ఈ సీజన్‌లో లభించే చిలగడదుంపలు తింటే బీటా కెరోటిన్ శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బచ్చలకూర, కాలే వంటి ఆకుకూరలు తింటే వాటిలోని విటమిన్ A,C,Kలతో రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.
News December 11, 2024
శ్రీలీలకు పెళ్లి చేసే బాధ్యత నాదే: సీనియర్ హీరో
అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీలపై ప్రేమను సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. ఈ బ్యూటీకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని చెప్పారు. మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని వెతికిపెడతానని తెలిపారు. అంతకుముందు తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని శ్రీలీల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.
News December 11, 2024
‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క
TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.