News September 28, 2024
BSNL కొత్త ప్లాన్.. రూ.345తో రోజూ 1GB డేటా

దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తున్న BSNL కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. తాజాగా 60 రోజుల వ్యాలిడిటీతో రూ.345 ప్రీప్రెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. డేటా లిమిట్ పూర్తయ్యాక నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది. ఇలాంటి ప్లాన్ జియో, ఎయిర్టెల్, Viలో లేదు.
Similar News
News November 5, 2025
పెరటి కోళ్లు-నాటు కోళ్ల పెంపకం.. ఏది బెస్ట్?

వనశ్రీ, రాజశ్రీ కోళ్లు 6 నెలల్లో 2.5- 3 KGల బరువు పెరుగుతాయి. నాటుకోళ్లు ఇదే సమయంలో 1.5 KGల బరువే పెరుగుతాయి. పెరటి కోళ్లు 150 నుంచి 160 రోజుల్లో తొలిసారి గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు 200 రోజుల తర్వాతే గుడ్లు పెడతాయి. పెరటి కోళ్లు ఏడాదికి 150-180 గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు ఏడాదికి 50- 60 గుడ్లే పెడతాయి. అందుకే పెరటికోళ్ల ఆరోగ్యం, మేతలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు నిపుణులు.
News November 5, 2025
ట్రంప్ పార్టీ ఓటమి

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అబిగైల్కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.
News November 5, 2025
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.


