News September 28, 2024

BSNL కొత్త ప్లాన్.. రూ.345తో రోజూ 1GB డేటా

image

దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న BSNL కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో కొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. తాజాగా 60 రోజుల వ్యాలిడిటీతో రూ.345 ప్రీప్రెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. డేటా లిమిట్ పూర్తయ్యాక నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది. ఇలాంటి ప్లాన్ జియో, ఎయిర్‌టెల్, Viలో లేదు.

Similar News

News July 11, 2025

‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ 5.27 గంటలు

image

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్‌ రివీలైంది. దాదాపు 5 గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని రాసుకొచ్చింది.

News July 11, 2025

అమెరికాలో రిచెస్ట్ ఇండియన్ ఇతడే

image

విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొందరు భారతీయులు అక్కడివారిని మించి సంపాదిస్తున్నారు. ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో జెడ్‌స్కేలర్ కో ఫౌండర్ జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వినోద్ ఖోస్లా ($9.2 billion), రాకేశ్ గంగ్వాల్ ($6.6 b), రొమేశ్ టీ వాద్వానీ ($5.0 b), రాజీవ్ జైన్ ($4.8 b) ఉన్నారు.

News July 11, 2025

బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

image

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?