News March 5, 2025
BSNL OFFER.. అదిరిపోయే ప్లాన్

ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా BSNL హోలీ ధమాకా ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్‌ను మరో నెల పొడిగించింది. రూ.2399తో రీఛార్జ్ చేసుకున్న వారికి గతంలో 395 రోజులు వ్యాలిడిటీ ఉండగా, ఇకపై 425 రోజులు ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఆన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత SMSలు చేసుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌లో ఈ ప్లాన్ ధరలు రూ.3000కు పైనే ఉన్నాయి.
Similar News
News March 18, 2025
ఉగ్రవాదులపై దాడులు.. నెక్స్ట్ టార్గెట్ అతడేనా?

PAKలో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హతమవడంతో ఆ సంస్థకు పెద్ద దెబ్బే తగిలింది. అయితే తర్వాతి దాడి LET వ్యవస్థాపకుడు, 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌పైనే జరిగే ఛాన్సుందని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 2023 రాజౌరి, 2024 రియాసి దాడుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఖతల్‌ను శనివారం గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడులు LET ఆపరేషన్స్‌ను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.
News March 17, 2025
పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్‌సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్‌ను కోరగా తాజాగా అనుమతి లభించింది.
News March 17, 2025
రన్యారావు కేసులో మరో ట్విస్ట్

బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్టైన నటి రన్యా రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య రన్యా రావుతో తనకు సంబంధం లేదని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు గతేడాది నవంబర్‌లో పెళ్లి కాగా, డిసెంబర్ నుంచే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో జతిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.