News February 1, 2025

BUDGET 2025: నగరాల కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ఫండ్

image

నగరాలను గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు, క్రియేటివ్ రీ డెవలప్‌మెంటుకు మద్దతిచ్చేందుకు రూ.లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాగునీరు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధారపడతగిన ప్రాజెక్టులకు ఇది 25% నిధులు ఇస్తుందన్నారు. బాండ్లు, బ్యాంకు లోన్లు, PPP పద్ధతిలో 50% నిధి ఏర్పాటు చేస్తామన్నారు. FY 2025-26కి గాను రూ.10వేల కోట్లు కేటాయించారు.

Similar News

News November 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 13, 2025

పాకిస్థాన్‌తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

image

ఇస్లామాబాద్‌లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.