News February 1, 2025
BUDGET 2025: నగరాల కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ఫండ్

నగరాలను గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు, క్రియేటివ్ రీ డెవలప్‌మెంటుకు మద్దతిచ్చేందుకు రూ.లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాగునీరు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధారపడతగిన ప్రాజెక్టులకు ఇది 25% నిధులు ఇస్తుందన్నారు. బాండ్లు, బ్యాంకు లోన్లు, PPP పద్ధతిలో 50% నిధి ఏర్పాటు చేస్తామన్నారు. FY 2025-26కి గాను రూ.10వేల కోట్లు కేటాయించారు.
Similar News
News February 20, 2025
జెలెన్‌స్కీ ఓ నియంత: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్‌లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
News February 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 20, 2025
ఫిబ్రవరి 20: చరిత్రలో ఈరోజు

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం