News February 1, 2025

BUDGET: లిథియం బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత

image

లిథియం-అయాన్ బ్యాటరీల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కాపర్, కోబాల్ట్, సెలీనియం, సిలికాన్ డయాక్సైడ్ వంటి అరుదైన ఖనిజాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం ధరలో ఈ బ్యాటరీల ధర 35 నుంచి 40 శాతం ఉంటుంది. ఈ నిర్ణయంతో ఈవీల ధర తగ్గనుంది.

Similar News

News February 17, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసేది ఎవరంటే?: క్లార్క్

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లార్క్ జోస్యం చెప్పారు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చారని చెప్పారు. మరోవైపు ENG ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో జోఫ్రాను ఎదుర్కోవడం కష్టమేనని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుందన్నారు.

News February 17, 2025

ఫుడ్ డెలివరీ సంస్థలకు ‘చికెన్’ దెబ్బ!

image

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్‌ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.

News February 17, 2025

పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

image

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!