News November 12, 2024
బడ్జెట్ నిరాశపర్చింది: VSR
AP ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి నిరాశ కలిగించిందని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో బడ్జెట్‌లో చెప్పకపోవడం ప్రజలను మోసం చేయడమే. ప్రజా ప్రయోజనాలు చెప్పకుండా ఈ బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, వైసీపీపై నిందలతోనే నిండిపోయింది. చంద్రబాబు బడ్జెట్ స్వీయపొగడ్తలతో ఒక రాజకీయ కరపత్రంగా మిగిలింది’ అని Xలో విమర్శలు గుప్పించారు.
Similar News
News December 14, 2024
ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచారు: బన్నీ లాయర్లు
అల్లు అర్జున్‌ను రాత్రంతా జైల్లోనే ఉంచడంపై ఆయన తరఫు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే బన్నీని జైల్లో ఉంచారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే విషయమై అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో సినీ ప్రముఖులు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
News December 14, 2024
BITCOIN: ఒకరోజు లాభం Rs 1.20లక్షలు
క్రిప్టో మార్కెట్లు నిన్న అదరగొట్టాయి. దాదాపుగా టాప్ కాయిన్లన్నీ లాభాల పంట పండించాయి. బిట్‌కాయిన్ $1419 (Rs 1.20L) మేర పెరిగింది. $99,205 వద్ద కనిష్ఠ, $1,01,895 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి $1,01,424 వద్ద ముగిసింది. నేడు అదే స్థాయి వద్ద మొదలై $505 లాభంతో $1,01,973 వద్ద ట్రేడవుతోంది. నిన్న ETH 0.61, XRP 3.87, BNP 2.94, DOGE 1.28, ADA 1.02, AVAX 2.26, LINK 2.10, SHIB 1.93% మేర లాభపడ్డాయి.
News December 14, 2024
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈయనే..
TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!