News March 12, 2025

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

image

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా నెలాఖరు వరకు సమావేశాలు సాగే అవకాశం ఉంది. ఇందులోనే బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ KCR సభకు హాజరుకానున్నారు.

Similar News

News January 23, 2026

APPLY NOW: SACONలో 36 పోస్టులు

image

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<>SACON<<>>) 36 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in

News January 23, 2026

వసంత రుతువులో ప్రకృతి ఎందుకు పులకరించిపోతుందో తెలుసా?

image

వసంత పంచమికి, ప్రేమ దేవుడు మన్మథుడితో సంబంధం ఉంది. శివుడి ధ్యానాన్ని భంగం కలిగించి, పార్వతీ దేవిపై ఆయనకు అనురాగం కలిగేలా చేయడానికి మన్మథుడు పూబాణాలు ప్రయోగించిన రోజు ఇదేనట. దీంతో శివుడు మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు. రతీదేవి వేడుకోలుపై తిరిగి ప్రాణం పోశాడు. ఈ కాలంలో కొత్త చిగుళ్లతో ప్రకృతి పులకించేలా చేసేది మన్మథుడని నమ్ముతారు. అందుకే ఈరోజును ప్రేమకు, సృజనాత్మకతకు ప్రతీకగా చెబుతారు.

News January 23, 2026

ఏ లోపం లేకపోయినా పిల్లలు పుట్టట్లేదా?

image

కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కడుపు పండే సూచనలు కనిపించవు. వైద్య పరీక్షల్లో కూడా ఇద్దరిలో ఏ లోపం లేదని నిర్ధరణ అవుతుంది. ఈ రకమైన పరిస్థితిని Unexplained Infertilityగా పిలుస్తారంటున్నారు నిపుణులు. దీనికోసం జీవనశైలి మార్పులు చేసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. తర్వాత IUI విధానాన్ని డాక్టర్లు సూచిస్తారు. అది కూడా ఫలితం చూపకపోతేనే IVFకు వెళ్లాలని చెబుతున్నారు.