News February 1, 2025

BUDGET: మెడిసిన్ ఆశావహులకు స్వీట్ న్యూస్

image

మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75000 పెంచుతామని తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇక యువత కోసం దేశవ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఆరంభిస్తామన్నారు. రూ.500 కోట్లతో విద్యలో AI ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.

Similar News

News November 28, 2025

తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో మరిన్ని అరెస్టులు..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్న కరీముల్లను సైతం 15వ తేదీలోపు అదుపులోకి తీసుకునే దిశగా సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి.

News November 28, 2025

స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

image

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

News November 28, 2025

జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

image

జపాన్‌తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.