News February 1, 2025

BUDGET: మెడిసిన్ ఆశావహులకు స్వీట్ న్యూస్

image

మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75000 పెంచుతామని తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇక యువత కోసం దేశవ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఆరంభిస్తామన్నారు. రూ.500 కోట్లతో విద్యలో AI ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.

Similar News

News February 17, 2025

IND-PAK మ్యాచ్‌పై ఓవర్‌హైప్: హర్భజన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచుల్లాగానే IND-PAK పోరు ఉంటుందని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ మ్యాచ్‌పై ఓవర్‌హైప్ నెలకొందని తెలిపారు. ‘భారత్ పటిష్ఠమైన జట్టు. పాకిస్థాన్ నిలకడలేమితో ఉంది. ఐసీసీ టోర్నీల్లో రెండు టీమ్‌ల నంబర్లను పోల్చి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల సొంత గడ్డపై జరిగిన ట్రైసిరీస్‌(PAK-NZ-SA)లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

News February 17, 2025

సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ: స్వామి

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News February 17, 2025

‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.

error: Content is protected !!