News October 12, 2024
భవిష్యత్తుకోసం బలమైన టీమ్‌ను నిర్మిస్తున్నాం: డెస్కాటే
వచ్చే రెండేళ్లలో బలమైన కోర్ టీమ్‌ను తయారుచేయాలనేదే తమ లక్ష్యమని టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే తెలిపారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. నాణ్యమైన ఆటగాళ్లు చాలామంది ఉండటం భారత జట్టు అదృష్టమని పేర్కొన్నారు. 2 విభాగాల్లోనూ జట్టుకు ఉపయోగపడేవారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు.
Similar News
News November 6, 2024
తెలంగాణలో ఇవాళ్టి నుంచి కులగణన
TG: ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరిస్తారు. దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా, 10% కుటుంబాలను వీరు మరోసారి సర్వే చేస్తారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
News November 6, 2024
ఇవాళ్టి నుంచి ఆందోళనలు: షర్మిల
AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో PCC చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ్టి నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నాయి. ‘ఛార్జీల పెంపు పాపం వైసీపీదని, కూటమికి సంబంధం లేదని చెప్పడం సరికాదు. అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి’ అని ఆమె సూచించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే నిరసనలో షర్మిల పాల్గొంటారు.
News November 6, 2024
ఫోన్ ఛార్జింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి
చాలామంది ఫోన్ ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అది ఫోన్ల పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.
* రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు. ఫోన్‌ను బట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పట్టే సమయాన్ని తెలుసుకొని, అంతసేపే ఛార్జింగ్ పెట్టాలి.
* ప్లగ్ ఇన్ చేసి ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయొద్దు.
* వంటగదుల్లో ఛార్జింగ్ పెట్టొద్దు.
* ఫుల్ ఛార్జ్ అయినా స్విచ్ ఆఫ్ చేయకపోవడం ప్రమాదకరం.