News December 2, 2024

1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు: అనిత

image

AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడారు. భూకబ్జాలు, ఆక్రమణలు అరికట్టడంపై తాము స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News April 14, 2026

DANGER: వేసవిలో ఇవి తింటే..

image

సమ్మర్‌లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.

News April 14, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/sticky_jsps/result_whatsap_push.jsp?token={TOKEN}

News April 14, 2026

ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

image

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.