News June 19, 2024
బుల్ జోరు.. సరికొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు

ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠంగా 77,581ను తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్ల లాభంలో 77,454 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఓ దశలో 23,630 మార్క్ అందుకున్న నిఫ్టీ ప్రస్తుతం 23,587 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో లాభాలు, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.
Similar News
News January 19, 2026
ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లాయి. నేషనల్ పార్క్ సమీపంలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోలు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
News January 19, 2026
ఉన్నావ్ అత్యాచార కేసు.. కుల్దీప్ సెంగార్‌కు చుక్కెదురు

ఉన్నావ్ <<18703366>>అత్యాచార<<>> ఘటనలో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో విధించిన పదేళ్ల జైలు శిక్షను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను సవాలు చేస్తూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అతడికి బెయిల్ ఇచ్చేందుకూ ధర్మాసనం అంగీకరించలేదు.
News January 19, 2026
మళ్లీ ఇండియాకు రాను: విదేశీయురాలు

ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికన్ మహిళకు ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ సాకుతో వచ్చిన ఓ టీనేజ్ బాలుడు ఆమె బ్రెస్ట్‌ను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణాన్ని అబ్బాయి తల్లి వెనకేసుకొస్తూ అది ‘ఓవర్ యాక్షన్’ అని కొట్టిపారేయడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ‘ఇకపై భారత్‌కు, దక్షిణాసియాకే రాను’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉంది.


