News June 19, 2024

బుల్ జోరు.. సరికొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు

image

ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠంగా 77,581ను తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్ల లాభంలో 77,454 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఓ దశలో 23,630 మార్క్ అందుకున్న నిఫ్టీ ప్రస్తుతం 23,587 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో లాభాలు, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.

Similar News

News November 9, 2025

మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

image

జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.

News November 9, 2025

NIEPVDలో ఉద్యోగాలు

image

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<>NIEPVD<<>>) 14 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28లోపు అప్లై చేసుకోవచ్చు. వీటిలో లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. లెక్చరర్లకు నెలకు జీతం రూ.60వేలు, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.45వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: niepvd.nic.in

News November 9, 2025

పూజలో ఏ పూలు వాడాలి? ఏ పూలు వాడొద్దు?

image

పూజకు జిల్లెడ, గన్నేరు, మారేడు, ఉమ్మెత్త, దత్తరేణు, జమ్మి, నల్లకలువలు చాలా శ్రేష్ఠమైనవి. దాసాని, మంకన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, తోడిలేని పూలు పూజకు పనికిరావు. ఉమ్మెత్త పువ్వుకు పట్టింపు లేదు. మారేడులో లక్ష్మీదేవి, నల్లకలువలో పార్వతీదేవి, కమలంలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే, కొన్ని దేవతలను వాటికి ఇష్టమైన పువ్వులు, ఆకులతోనే పూజించాలి. కొన్ని పువ్వులను కొందరు దేవతలకు అస్సలు వాడకూడదు. <<-se>>#Pooja<<>>