News September 24, 2024
బుల్ రంకెలు: ఫస్ట్‌టైమ్ 85,000 బ్రేక్ చేసిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. చరిత్రలో తొలిసారి BSE సెన్సెక్స్ 85,000 స్థాయిని టచ్ చేసింది. 85,021 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంతో 85,014 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ వేగంగా 26,000 వద్దకు పరుగులు తీస్తోంది. ఇంట్రాడేలో 25,971 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ 26 పాయింట్లు ఎగిసి 25,965 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, హిందాల్కో టాప్ గెయినర్స్.
Similar News
News January 20, 2026
సంక్రాంతికి ప్రైవేటు దందా.. 1,896 బస్సులపై కేసులు

AP: నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,896 బస్సులపై కేసులు నమోదు చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు 548, పన్ను ఎగవేత, పర్మిట్, ఫిట్‌నెస్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై 1,348 కేసులు పెట్టారు. ఆయా ట్రావెల్స్‌పై మొత్తంగా రూ.1.27 కోట్ల జరిమానాలు విధించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 18 వరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
News January 20, 2026
600 పోస్టులు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గలవారు JAN 25 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12,300 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 20, 2026
గ్రీన్‌లాండ్‌కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.


