News September 24, 2024
బుల్ రంకెలు: ఫస్ట్‌టైమ్ 85,000 బ్రేక్ చేసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. చరిత్రలో తొలిసారి BSE సెన్సెక్స్ 85,000 స్థాయిని టచ్ చేసింది. 85,021 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంతో 85,014 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ వేగంగా 26,000 వద్దకు పరుగులు తీస్తోంది. ఇంట్రాడేలో 25,971 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ 26 పాయింట్లు ఎగిసి 25,965 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, హిందాల్కో టాప్ గెయినర్స్.
Similar News
News October 16, 2024
నేడు క్యాబినెట్ భేటీ.. కొత్త పాలసీలపై చర్చ
AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదారు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి, ఆమోదించే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు10% ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నారు.
News October 16, 2024
SBI క్రెడిట్‌కార్డు యూజర్లకు గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <
News October 16, 2024
అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!
కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.