News June 20, 2024
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారు
AP: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో నెగ్గారు.
Similar News
News September 18, 2024
రాజకీయ పార్టీల ఫ్రీబీస్‌పై విచారిస్తాం: సుప్రీం కోర్టు
ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. అవతలిపక్షం వాదనలు వినాల్సి ఉండటంతో పిల్‌ను నేడు విచారించడం కుదరదంది. కాజ్‌లిస్టు నుంచి డిలీట్ చేయబోమని CJI చంద్రచూడ్, జస్టిస్‌లు పార్థివాల, మనోజ్ మిశ్రా బెంచ్ పేర్కొంది. ఫ్రీబీస్ హామీలిచ్చే పార్టీల గుర్తుల్ని నిలిపేయాలని, వాటి గుర్తింపు రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ మార్చి 20న ఓ లాయర్ ఈ పిల్ వేశారు.
News September 18, 2024
గ్రామీణ యువకుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!
బిహార్ అనగానే వలసలు, గొడవలే గుర్తొస్తాయి. కానీ, తమలోనూ ఎంతో ప్రతిభ ఉందని జము ఖరియాకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అభిషేక్ కుమార్ నిరూపించారు. గ్రామీణప్రాంతానికి చెందిన అతను లండన్‌లోని గూగుల్ కంపెనీలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. NIT పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2022లో Amazonలో ₹1.08 కోట్ల వేతనంతో ఉద్యోగం పొందారు. తాజాగా గూగుల్‌లో జాబ్ సాధించారు.
News September 18, 2024
ప్రతి బాల్‌కు ముందు ‘ఓం నమః శివాయ’ జపం చేశా: కోహ్లీ
బీసీసీఐ స్పెషల్ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విరాట్ కోహ్లీ పటిష్ఠమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్మించారని, 25 ఏళ్ల వయసులోనే పవర్‌ఫుల్ టీమ్‌ను ఏర్పరిచారని గంభీర్ కొనియాడారు. కాగా 2014-15 ఆస్ట్రేలియన్ టూర్‌లో ప్రతి బాల్‌కు ముందు ఓం నమః శివాయ జపం చేసినట్లు కోహ్లీ తెలిపారు. 2009 NZ పర్యటనలో రెండున్నర రోజులు ‘హనుమాన్ చాలీస’ విన్నట్లు గంభీర్ చెప్పారు.