News August 4, 2024
విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10,000 పొందే ఛాన్స్

ఇన్‌స్పైర్-మనక్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.10,000 సాయం అందిస్తోంది. 6-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు దీని ద్వారా సైన్స్‌పై ఆసక్తిని పెంచాలని భావిస్తోంది. దీంతో రీసెర్చ్, టెక్నాలజీపై వారు ఫోకస్ పెడతారని అంచనా వేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం SEP 15 వరకు దరఖాస్తు చేయవచ్చు. వివరాలకు ఇక్కడ <
Similar News
News March 19, 2026
భీకర స్థాయికి యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం

ఇరాన్‌పై యుద్ధాన్ని భీకర స్థాయికి తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వేలాది US బలగాలను పశ్చిమాసియాకు తరలించే యోచన చేస్తున్నట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు రక్షణ కల్పించడంతోపాటు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికీ వారిని పంపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమని ఓ అధికారి చెప్పినట్లు వివరించింది.
News March 19, 2026
ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లేదా?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకడం లేదు. చెట్లను నరికేయడం, తెగుళ్లతో చనిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వేప పువ్వు దొరుకుతున్నా పట్టణాలు, సిటీల్లో కరవు నెలకొంది. HYDలో కొన్నిచోట్ల చిన్న రెమ్మకే ₹25-30 తీసుకుంటున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయాన్ని పూర్వీకులు సూచించలేదని, అయితే దాని స్థానంలో తులసిని వాడుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.
News March 19, 2026
AP జాబ్ క్యాలెండర్: విభాగాలు.. పోస్టుల వివరాలు

* మే 15: ఉన్నత విద్యలో 1500 <<19422391>>పోస్టులు<<>>
* ఆగస్టు 15: గ్రూప్ I – 91, హోం శాఖ – 2,778, ఇతర శాఖలు – 928
* సెప్టెంబర్ 15: గ్రూప్-II – 750, ఇంజినీరింగ్ – 503, ఇతర శాఖలు – 506
* అక్టోబర్ 15: పాఠశాల/ఇంటర్ విద్య – 3004
** మొత్తం ఉద్యోగాలు – 10,060
-SHARE IT


