News May 11, 2024
సెటిలర్లకు బంపరాఫర్?

TG: ఏపీలో అసెంబ్లీతోపాటు MP ఎన్నికలు కూడా జరుగుతుండటంతో హైదరాబాద్‌లోని పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో సెటిలర్ల ఓట్లు లక్షల్లో ఉన్నాయి. వీరంతా ఓటేయడానికి APకి పయనమవుతున్నారు. కానీ ఇక్కడే ఓటేయాలంటూ తెలంగాణ నేతలు ప్రాధేయపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు ఇస్తున్నట్లు టాక్. డబ్బుతోపాటు బహుమతులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 28, 2026
డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్ వాడడం, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులు ఎత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 28, 2026
బడ్జెట్‌పై BJP అవగాహన సదస్సులు

కేంద్ర బడ్జెట్‌పై FEB1 నుంచి దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని BJP నిర్ణయించింది. బడ్జెట్ నిర్ణయాలు, వాటి ప్రభావాన్ని ప్రజలకు తెలపనుంది. పదేళ్లలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్‌పై ప్రభుత్వ చర్యలను వివరించనుంది. కేంద్రమంత్రులు, MPలు, రాష్ట్ర నేతలను వీటిలో భాగస్వాములను చేయనుంది. దీనికోసం దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా Ex MP GVL నర్సింహారావును నియమించింది.
News January 28, 2026
ఈ ఉంగరం ధరిస్తే..

జ్యోతిషం ప్రకారం పుష్పరాగం ఎంతో పవిత్రమైనది. ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక. జ్ఞానం, సంపద, సంతోషకర వివాహ జీవితం కోసం దీన్ని ధరిస్తారు. మహిళలకు వివాహ జాప్యం తొలగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇది బాగా పనిచేస్తుందని నమ్మకం. పగుళ్లు లేని, పారదర్శకమైన బంగారు రంగు పుష్పరాగం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, దైవానుగ్రహం లభిస్తుందట. జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.


