News May 11, 2024

సెటిలర్లకు బంపరాఫర్?

image

TG: ఏపీలో అసెంబ్లీతోపాటు MP ఎన్నికలు కూడా జరుగుతుండటంతో హైదరాబాద్‌లోని పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో సెటిలర్ల ఓట్లు లక్షల్లో ఉన్నాయి. వీరంతా ఓటేయడానికి APకి పయనమవుతున్నారు. కానీ ఇక్కడే ఓటేయాలంటూ తెలంగాణ నేతలు ప్రాధేయపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు ఇస్తున్నట్లు టాక్. డబ్బుతోపాటు బహుమతులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 14, 2025

ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.

News December 14, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* AP CM చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
* కేంద్ర మాజీమంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో కన్నుమూత
* మెస్సీ టీమ్‌పై గెలిచిన CM రేవంత్ జట్టు
* ₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి
* సంక్రాంతికి SEC నుంచి ప్రత్యేక రైళ్లు.. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్
* ₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్
* దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

News December 14, 2025

Kerala: కమ్యూనిస్టులకు ఎదురుదెబ్బ!

image

కేరళ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా కనిపించింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని అధికార LDFకు ఈ ఫలితాలు షాకిచ్చాయి. UDF(కాంగ్రెస్) బలం పుంజుకుంది. 6 కార్పొరేషన్లలో 4, 86 మున్సిపాలిటీల్లో 54, 941 పంచాయతీల్లో 504 స్థానాలను గెలుచుకుంది. LDFకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు <<18552178>>తిరువనంతపురం<<>> కార్పొరేషన్‌లో NDA గెలిచింది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు షాక్ తప్పదనే చర్చ సాగుతోంది.