News December 30, 2024

బుమ్రా.. భారత్‌కు దొరికిన ఓ అద్భుతం: మంజ్రేకర్

image

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. ఆయన భారత్‌కు దొరికిన ఓ అద్భుతమని వ్యాఖ్యానించారు. ‘ఆ మనిషికి బలహీనతలనేవే లేవు. భారత్‌కు అతనో బహుమతి. ఫార్మాట్ ఏదైనా సరే వికెట్ కావాలనుకుని మనం కోరుకుంటే వచ్చి వికెట్ తీస్తారు. పిచ్‌తో, పరిస్థితులతో అతడికి సంబంధం ఉండదు. 20లోపు సగటుతో 200 వికెట్లు తీయడమా! మతి పోయే ఘనత అది’ అని కొనియాడారు.

Similar News

News January 13, 2025

కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు

image

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు.

News January 13, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.

News January 13, 2025

తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి దారుణం!

image

AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.