News January 7, 2025
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో బుమ్రా
ఐసీసీ ప్రతి నెలా ఉత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత నెలకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలర్ డేన్ ప్యాటర్సన్‌ను నామినేట్ చేసింది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లతో రాణించగా కమిన్స్ 25 వికెట్లు, 159 పరుగులు చేశారు. ఇక ప్యాటెర్సన్ పాక్‌తో 2 టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టారు.
Similar News
News January 12, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని, ఆలోపు రిటైర్ అయ్యేవారికి కుదరదని తెలిపింది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా.. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్‌మెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆరోపించింది.
News January 12, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ
ఢిల్లీలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలుండగా మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్న 10 నుంచి 12 చోట్ల ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో చాందినీ చౌక్, కార్వాన్ నగర్ వంటి కీలక స్థానాలున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. వచ్చే నెల 5న ఎన్నికలు జరగనుండగా, అదే నెల 8న ఫలితాల్ని ప్రకటించనున్నారు.
News January 12, 2025
నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్.. బరిలో తెలుగు ప్లేయర్
మెగా టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సెర్బియా ప్లేయర్ జకోవిచ్ ఫేవరెట్‌గా ఉన్నారు. ఈ సారి ట్రోఫీ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్స్ రికార్డును ఖాతాలో వేసుకోవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. జకోకు అల్కరాజ్, సినర్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ రిత్విక్ డబుల్స్ విభాగంలో ఆడుతున్నారు.