News January 7, 2025

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో బుమ్రా

image

ఐసీసీ ప్రతి నెలా ఉత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత నెలకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలర్ డేన్ ప్యాటర్సన్‌ను నామినేట్ చేసింది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లతో రాణించగా కమిన్స్ 25 వికెట్లు, 159 పరుగులు చేశారు. ఇక ప్యాటెర్సన్ పాక్‌తో 2 టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టారు.

Similar News

News January 26, 2025

ప్రముఖ కార్డియాక్ సర్జన్ KM.చెరియన్ కన్నుమూత

image

ప్రముఖ కార్డియాక్ సర్జన్ KM.చెరియన్(82) కన్నుమూశారు. నిన్న బెంగళూరులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలారని, ఆస్పత్రిలో చేర్పించగా అర్ధరాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత్‌లో తొలి కరోనరీ ఆర్టరీ బైపాస్ శస్త్రచికిత్స, తొలి గుండె-ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేసిన వైద్యుడిగా ఆయన పేరొందారు. పద్మశ్రీ, హార్వర్డ్ మెడికల్ ఎక్స్‌లెన్స్ వంటి అవార్డులు అందుకున్నారు.

News January 26, 2025

ఘనంగా గణతంత్ర వేడుకలు

image

దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని BJP కేంద్ర కార్యాలయంలో జాతీయాధ్యక్షుడు JP నడ్డా, బెంగళూరులోని INC పార్టీ కార్యాలయం వద్ద AICC అధ్యక్షుడు ఖర్గే త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు. ముంబైలో MH గవర్నర్ రాధాకృష్ణన్, చెన్నైలో TN గవర్నర్ రవి, భువనేశ్వర్‌లో ఒడిశా గవర్నర్ హరిబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు జరిగాయి.

News January 26, 2025

RGV డైరెక్షన్‌లో వెంకటేశ్ సినిమా?

image

ఇక నుంచి తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీస్తానన్న RGV ‘సిండికేట్’ అనే మూవీని తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో మెయిన్ లీడ్‌గా విక్టరీ వెంకటేశ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.