News January 7, 2025

భారత జట్టుకు శాపంగా బుమ్రా గాయాలు

image

బుమ్రా కెరీర్‌లో గాయాలు టీమ్ ఇండియాకు శాపంగా మారాయి. తిరిగి కోలుకొని జట్టులోకి వచ్చిన ప్రతిసారీ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నా ఆయన దూరమైన మ్యాచుల్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. 2018 నుంచి అదే కొనసాగుతోంది. ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేయడం బుమ్రా ప్రత్యేకత. తాజాగా AUSతో చివరికి టెస్టు మధ్యలోనే మైదానాన్ని వీడటం ఆందోళనకు కలిగిస్తోంది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన ప్రదర్శనే కీలకం కానుంది.

Similar News

News January 13, 2025

రేషన్ కార్డులకు రికమెండేషన్స్ అవసరం లేదు: మంత్రి

image

TG: రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్డుల జారీకి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం లేదని, అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారిలో ఎవరైనా అనర్హులుంటే గ్రామ సభల్లో చెప్పాలని అన్నారు. వారి అప్లికేషన్లను పక్కనపెడతామని పేర్కొన్నారు.

News January 13, 2025

బీసీసీఐ కొత్త సెక్రటరీ, ట్రెజరర్ ఎవరంటే?

image

బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణమే వీరు తమ బాధ్యతలను చేపడతారని పేర్కొంది. నిన్న జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. జైషా, ఆశిష్ షెలార్ స్థానాలను భర్తీ చేస్తున్న వీరు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు.

News January 13, 2025

నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్

image

హీరోయిన్ అన్షు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావుపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ఛైర్‌పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. కాగా ‘అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకు సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా’ అని త్రినాథరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.