News November 30, 2024
TGPSC కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కొత్త ఛైర్మన్‌గా IAS అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3తో ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
Similar News
News February 9, 2026
NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.
News February 9, 2026
బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.


