News May 18, 2024
మెట్రో లేని రూట్లలో 10 నిమిషాలకో బస్సు

TG: హైదరాబాద్లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో రైళ్ల తరహాలోనే బస్సులు కూడా సమయపాలనతో నడిచేలా చూడాలని సంస్థ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్-మణికొండ రూట్(47ఎల్ బస్సులు)లో నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యతో మెట్రోకు దీటుగా బస్సుల్లో రద్దీ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News December 18, 2025
హౌసింగ్ బోర్డు LIG ఫ్లాట్ల విక్రయానికి నిర్ణయం

TG: వివిధ ప్రాంతాల్లోని 339 LIG ఫ్లాట్ల(FLAT)ను విక్రయించేందుకు హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. HYD గచ్చిబౌలిలో 111, వరంగల్లో 102, ఖమ్మంలో 126 ఫ్లాట్లను అమ్మనున్నట్లు బోర్డు VC గౌతం తెలిపారు. వాటి ధరలు గచ్చిబౌలిలో ₹26L-₹36.20L, వరంగల్లో ₹19L-₹21.50L, ఖమ్మంలో ₹11.25Lగా నిర్ణయించామన్నారు. ఆన్లైన్, మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని, వివరాలకు https://tghb.cgg.gov.inని సందర్శించాలని సూచించారు.
News December 18, 2025
చలికాలంలో గుండెపోటు ముప్పుకు ఈ టిప్స్తో చెక్!

చలితోపాటు కాలుష్యం ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళితే గుండెపోటు ముప్పు ఎక్కువవుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఛాతీ, మెడ, తల కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ముఖ్యం. పొగమంచు ఎక్కువగా పడుతుంటే మాస్క్ పెట్టుకోవాలి. గాలిలో హానికర కణాల నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో ఎయిర్ప్యూరిఫయర్లు వాడాలి.
News December 18, 2025
‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్

AP: PPP మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘PPPలో అభివృద్ధికి త్వరలో 4 కాలేజీలను భాగస్వాములకిస్తాం. ఇది తప్పయితే వైద్య శాఖ మంత్రినైన నన్ను జైలుకు పంపే చర్యలు తీసుకోవచ్చు’ అని సవాల్ విసిరారు. PPPని కేంద్రం, నీతి ఆయోగ్, కోర్టులు సమర్థించాయని, అందుకని PM మోదీ సహా అందరినీ జైలుకు పంపిస్తావా? అని నిప్పులు చెరిగారు.


