News May 18, 2024

మెట్రో లేని రూట్లలో 10 నిమిషాలకో బస్సు

image

TG: హైదరాబాద్‌లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో రైళ్ల తరహాలోనే బస్సులు కూడా సమయపాలనతో నడిచేలా చూడాలని సంస్థ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్-మణికొండ రూట్‌(47ఎల్ బస్సులు)లో నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యతో మెట్రోకు దీటుగా బస్సుల్లో రద్దీ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News December 11, 2024

గజగజ.. మళ్లీ పెరిగిన చలి

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గతనెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. TGలోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గిపోయింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

News December 11, 2024

స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

image

క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ఇస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే నేపథ్యంలో సెలవులుగా పేర్కొంది. గతంలో క్రిస్మస్‌కు 5 రోజులు సెలవులు ఇవ్వగా ఈసారి ప్రభుత్వం 3 రోజులకు కుదించింది. మరోవైపు ఏపీలో 24, 26న ఆప్షనల్ హాలిడే, 25న జనరల్ హాలిడే ఉండనుంది.

News December 11, 2024

మెహుల్ చోక్సీ ఆస్తుల వేలం!

image

ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీ ఆస్తులు వేలం వేయడానికి ఈడీ సిద్ధమైంది. అతడికి చెందిన రూ.2,500కోట్లు విలువైన సొత్తును అక్రమాస్తుల నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ ఆస్తుల వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని PNB, ICICI బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఈడీ కోర్టు ఇప్పటికే ఆదేశించింది. తప్పుడు పత్రాలతో PNBకి రూ.13వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెహుల్ చోక్సీ విదేశాలకు పరారయ్యారు.