News December 27, 2024

కాలువ‌లో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

image

పంజాబ్‌లోని బ‌ఠిండాలో ఓ బ‌స్సు కాలువ‌లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జ‌గ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివ‌రాల మేర‌కు వంతెన‌పై రెయిలింగ్‌ను ఢీకొన‌డంతో బ‌స్సు కాలువ‌లో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 18 మంది ప్ర‌యాణికులు షాహిద్ భాయ్ మ‌ణిసింగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News February 9, 2026

అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

image

AP: అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ జీవో జారీ చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎన్‌విడియా కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే తొలి ఏఐ వర్సిటీగా నిలవనుంది.

News February 9, 2026

దీపారాధనలో ఎన్ని వత్తులు పెట్టాలి?

image

దీపారాధనలో వత్తుల సంఖ్యకు శాస్త్రపరంగా ప్రాముఖ్యత ఉంది. నిత్య దీపారాధనలో ఏకవత్తి పెట్టకూడదు. ఒకే వత్తిని అశుభ సమయాల్లో మాత్రమే వాడతారు. సామాన్యంగా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కనీసం 2 వత్తులు కలిపి వేయడం శుభప్రదం. దీనిని ‘దంపతి వత్తి’ అని కూడా అంటారు. రెండుకు మించి ఇంకా ఎన్ని వత్తులైనా పెట్టవచ్చు. అందుకు ఎలాంటి నియమాలు లేవు. 108 వత్తుల దీపం వెలిగిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం.

News February 9, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.