News December 27, 2024
కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి

పంజాబ్‌లోని బఠిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల మేరకు వంతెనపై రెయిలింగ్‌ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. 18 మంది ప్రయాణికులు షాహిద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News April 18, 2026
NRT: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడేవారికి కౌన్సెలింగ్

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్, ఇతర నేర కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీపీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో నేరాల నిర్మూలనకు 360 డిగ్రీల నిఘా ఏర్పాటుచేసినట్లు శుక్రవారం తెలిపారు. గత 3 సంవత్సరాల్లో క్రికెట్ బెట్టింగ్స్‌లో పట్టుబడిన వ్యక్తులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించడంతోపాటు, వారికి డ్రగ్ టెస్ట్‌లు చేశారు.
News April 18, 2026
పాడేరు: పీజీఆర్ఎస్‌కు 113, రెవెన్యూ క్లినిక్‌కు 14 ఫిర్యాదులు

పీజీఆర్ఎస్‌లో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులందరూ పీజీఆర్ఎస్‌కు తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 113, రెవెన్యూ క్లినిక్‌కు 14 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.