News June 13, 2024
బస్సు టికెట్ ధరలు పెరిగాయా? లేదా?.. అసలు విషయం ఇది!!

TGSRTC ఛార్జీల పెంపుపై కొందరు ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. కేంద్రం టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్‌లోని టోల్ సెస్‌ను సవరించామన్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఉన్న నేషనల్ హైవే రూట్లలో పదిరోజుల క్రితమే టికెట్‌పై రూ.3 చొప్పున పెంచారు. దీంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రయాణికులపై భారం పడ్డట్లే.
Similar News
News September 14, 2025
బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
News September 14, 2025
ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్‌కు AISF మద్దతు ప్రకటించింది.
News September 14, 2025
హైదరాబాద్‌లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.